- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD: తిరుమలలో అక్రమ వసూళ్లు.. లగేజీ కౌంటర్ ఉద్యోగిపై టీటీడీ వేటు
భక్తులకు ఉచితంగా అందించే లగేజీ కేంద్రంలో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని టీటీడీ విధుల నుంచి తక్షణమే తొలగించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: భక్తులకు ఉచితంగా అందించే లగేజీ కేంద్రంలో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని టీటీడీ (TTD) విధుల నుంచి తక్షణమే తొలగించింది. ఈ మేరకు సోమవారం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. లగేజీ కౌంటర్‌లో పనిచేస్తున్న నరసింహారెడ్డి అనే సిబ్బంది.. భక్తుల వద్ద ఒక్కో బ్యాగుకు రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన టీటీడీ అధికారులు, విచారణ చేపట్టి సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై వేటు వేశారు. ఇటీవల కాలంలో వీఐపీ దర్శనాలు, ఉద్యోగాల పేరిట మోసాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై టీటీడీ మరింత సీరియస్‌గా వ్యవహరించింది.
భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..
తిరుమలలో లగేజీ డిపాజిట్ సేవలు పూర్తిగా ఉచితం. భక్తులు తమ లగేజీ కోసం ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే, వెంటనే విజిలెన్స్ కంట్రోల్ నంబర్ 9866898630 కు ఫిర్యాదు చేయాలని టీటీడీ తెలిపింది. భక్తులు ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని టీటీడీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.






