ఏం చేసినా తిరుమలేశుడు క్షమించరు: వైసీపీ నేతలకు భాను ప్రకాష్ రెడ్డి వార్నింగ్

by Vemula.Srinu Prasad |

యాగాలు చేసినా, గంగానదిలో మునిగినా తిరుమల స్వామి క్షమించరని టీటీడీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. ..

ఏం చేసినా తిరుమలేశుడు క్షమించరు: వైసీపీ నేతలకు భాను ప్రకాష్ రెడ్డి  వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: యాగాలు చేసినా, గంగానదిలో మునిగినా తిరుమల స్వామి క్షమించరని టీటీడీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి(Bhanu Prakash Reddy) అన్నారు. శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన(Srivari Laddu adulteration incident)పై వైసీపీ(Ycp) నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. వైసీపీపై స్వామి ఆగ్రహం.. ఎన్డీయేపై అనుగ్రహం అంటూ భాను ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. గజినీ మహమ్మద్, గోరీ మహమ్మద్ మాదిరిగా గత ఐదేళ్లలో జగన్ పాలన జరిగిందని ఆరోపించారు. దండయాత్రలు చేసి దేవాలయాలను ఎలా కొల్లగొట్టారో సేమ్ టు సేమ్ అలానే జగన్ హయాంలోనూ జరిగిందన్నారు. శ్రీవారి లడ్డూలో నెయ్యి కాకుండా రసాయనాలు కలిపి కల్తీ చేశారని చెప్పారు. వైసీపీ నేతలకు సిట్ క్లీన్ చిట్ ఇవ్వలేదని, ఏ ముఖం పెట్టుకుని సంబరాలు చేసుకుంటున్నారని భాను ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.

Next Story