Tirumala:శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్లు.. వారికి టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్

by Jakkula.Mamatha |

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు.

Tirumala:శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్లు.. వారికి టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ తరుణంలో ప్రపంచ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తిరుమల(Tirumala) కొండపై కొలువుదీరిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు శ్రీవారి దర్శనం పేరిట భక్తులను మోసం చేసి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. నకిలీ దర్శనం, వసతి టిక్కెట్లను అందజేసి భక్తులను మోసం చేస్తున్న వ్యక్తులు, ఏజెంట్ల పై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. దర్శన టికెట్లు బుక్ చేస్తామని చెప్పి భక్తుల(Devotees) నుంచి కొందరు ఏజెంట్లు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని టీటీడీ(TTD) తెలిపింది. భక్తులను మోసం చేసేవారిని పట్టుకోవడానికి ప్రత్యేక నిఘా బృందాలు నియమించామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. దర్శన సమయంలో భక్తుల టికెట్లను విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేస్తారు. ఏదైనా టికెట్ నకిలీదని తేలితే, భక్తుడు అనవసరమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి, భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా ప్రలోభాలకు గురి చేసి దర్శనం, వసతి ఇప్పిస్తామని, డబ్బులు పంపాలని ఫోన్ చేసినా తమ దృష్టికి తీసుకురావాలని టీటీడీ కోరింది.

Next Story