- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆన్లైన్లో తిరుమల లడ్డు.. టీటీడీ సీరియస్ వార్నింగ్
తిరుమల లడ్డూకు ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. ఎవరైనా తిరుమల వెళితే వాళ్లను మొదట అడిగేది లడ్డూనే. అక్కడకు వెళ్లిన భక్తులు సైతం గంటలు గంటలు క్యూలో నిలబడి లడ్డూ

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూకు ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. ఎవరైనా తిరుమల వెళితే వాళ్లను మొదట అడిగేది లడ్డూనే. అక్కడకు వెళ్లిన భక్తులు సైతం గంటలు గంటలు క్యూలో నిలబడి లడ్డూ కోసం వెయిట్ చేస్తారు. అలాంటి తిరుమల లడ్డూలను ఆన్లైన్‌లో విక్రయిస్తున్నాం అంటూ 5 ఈకామర్స్ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఆ సంస్థలకు టీటీడీ నోటీసులు ఇచ్చింది.
పుష్ మైకార్డ్‌తో పాటూ మరో నాలుగు సంస్థలు తిరుమల లడ్డూల ఫోటోలను ఆన్‌లైన్‌లో పెట్టి డెలివరీ చేస్తామంటూ ప్రకటించుకుంటున్నాయి. దీంతో టీటీడీ నోటీసులు ఇవ్వడంతో పాటూ క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అని వార్నింగ్ ఇచ్చింది. తిరుమల లడ్డూకు ఎంతో ప్రత్యేకతతో పాటూ పవిత్రమైనది అన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఆన్లైన్‌లో అందుబాటులో ఉంది అంటే భక్తులు కొనుగోలు చేసి మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి టీటీడీ అలర్ట్ అయ్యి వెంటనే నోటీసులు అందజేసింది.






