- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల భక్తులకు అలర్ట్.. తస్మాత్ జాగ్రత్త
తిరుమల (Tirumala) భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ (TTD) అలర్ట్ జారీ చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ (TTD) అలర్ట్ జారీ చేసింది. ఈఓ జె.శ్యామలారావు పేరుతో ఫేస్ బుక్ లో అగంతకులు ఫేక్ అకౌంట్ (Facebook Fake Account) క్రియేట్ చేసినట్లు టీటీడీ గుర్తించింది. అ అకౌంట్ ద్వారా భక్తులకు డబ్బులు కావాలని మెసేజ్ లు పంపుతున్నారని, అలాంటివి నమ్మి మోసపోవద్దంటూ టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వాటి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎవరికైనా అలాంటి మెసేజ్ లు వస్తే.. వెంటనే టీటీడీ విజిలెన్స్ నంబర్ 9866898630, టోల్ ఫ్రీ నంబర్ 18004254141కు కాల్ చేసి సమాచారమివ్వాలని తెలిపింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ www.tirumala.org లేదా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వచ్చే ఇన్ఫర్మేషన్ ను మాత్రమే నమ్మాలని, మిగతా వాటిని నమ్మొద్దని సూచించింది.
Next Story






