అలిపిరి టోల్ గేట్ ఆర్చ్‌పై అన్యమత బొమ్మలంటూ వార్తలు... టీటీడీ స్ట్రాంగ్ రియాక్షన్

by Vemula.Srinu Prasad |

అలిపిరి టోల్‌గేట్ ఆర్చ్‌పై అన్యమత బొమ్మలంటూ ప్రసారం అవుతున్న వార్తలపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది....

అలిపిరి టోల్ గేట్ ఆర్చ్‌పై అన్యమత బొమ్మలంటూ వార్తలు... టీటీడీ స్ట్రాంగ్ రియాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి అలిపిరి(Tirupati Alipiri Tollgate) టోల్‌గేట్ ఆర్చ్‌పై అన్యమత బొమ్మలు ఉన్నాయంటూ కొన్ని మీడియా చానళ్లలో ప్రసారం కావడంతో పాటు పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. దీంతో టీటీడీ(TTD) అధికారులు సీరియస్ అయ్యారు. అసత్య వార్తలు ప్రసారం చేయడం బాధాకరమని, టోల్ గేట్ ఆర్చ్‌పై గంధర్వులు పుష్పమాలతో ఉన్న శిల్పాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అలిపిరి టోల్‌గేట్‌ను ఏళ్ల క్రితమే నిర్మించారని, సనాతన హైందవ ధర్మాన్ని ప్రతిబింబించే శిల్పాల రూపంలో, ఎస్వీ శిల్ప కళాశాల నిపుణుల సూచనలతో ఆర్చ్‌ను తీర్చిదిద్దిందని వెల్లడించారు.

‘‘గంధర్వులు పుష్పమాలతో ఉన్న చిత్రాలు ఆ శిల్పాల్లో ఉన్నాయి. అవి అన్యమత శిల్పాలు కావు. అలా చిత్రీకరించి, అవాస్తవపు వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయడం పూర్తిగా నిరాధారమైనదే కాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే. ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసత్య కథనాలను ప్రచురించినా, ప్రసారం చేసినా సదరు వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.’’ అని టీటీడీ అధికారులు హెచ్చరించారు.

Next Story