- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న త్రిపుర హైకోర్టు జడ్జి
by Vemula.Srinu Prasad |
విజయవాడ దుర్గమ్మను త్రిపుర హైకోర్టు జడ్జి దర్శించుకున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ దుర్గమ్మ(Vijayawada Durgamma)ను త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ టి. అమర్‌నాథ్ గౌడ్(Tripura High Court Judge Justice Dr. T. Amarnath Goud) దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రి(Indrakeeladri)కి వెళ్లి ఆయనను కనకదుర్గమ్మ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బోర్రా రాధాకృష్ణ (గాంధీ) ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ చైర్మన్ బోర్రా రాధాకృష్ణ గౌరవ న్యాయమూర్తికి అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఆలయ మర్యాదలతో జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. తెలుగు వారైన జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్ ప్రస్తుతం త్రిపుర హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు.
Next Story






