- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News : ప్రభుత్వ సలహదారుగా గిరిజన బిడ్డ అంకారావు
ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(Govt Adviser)గా ఓ గిరిజన వ్యక్తిని నియమించింది. పల్నాడు జిల్లాకు చెందిన కొమెరె అంకారావు(Komere Ankarao) అలియాస్ జాజిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. అడవుల పెంపకంపై జాజి ప్రభుత్వానికి సలహదారుగా నియమించబడ్డారు. కొమెరె జాజి పల్నాడు జిల్లా కారంపూడికి చెందినవాడు. ఆయన జీవితాన్ని మొత్తం నల్లమల అటవీ ప్రాంత రక్షణకు ధారపోశారు. ఆయన ప్రతిరోజూ క్రమం తప్పకుండా నల్లమల అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరి పారేస్తూ ఉంటారు.
ఇప్పటి వరకు ఆయన నల్లమలలోని 2 లక్షల ఎకరాల అటవీ విస్తీర్ణంలో ప్లాస్టిక్ చెత్తను ఒక్కడే ఏరి వేశాడు. అలాగే కోట్ల కొద్ది విత్తనాలను అడవుల్లో జల్లి, చెట్ల సంరక్షణను చూస్తూ ఉంటాడు. కాగా ప్రభుత్వ సలహాదారుగా రాజకీయవేత్తను కాకుండా అడవి గురించి పూర్తిగా పట్టు ఉన్న ఓ గిరిజన వ్యక్తిని ఎంపిన చేయడం పట్ల ఏపీ ప్రభుత్వంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.






