సచివాలయ ఉద్యోగులకు అల‌ర్ట్‌...నేటి నుంచే బదిలీల ప్ర‌క్రియ !

by velandi.Saikiran |

సచివాలయ ఉద్యోగుల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది

సచివాలయ ఉద్యోగులకు అల‌ర్ట్‌...నేటి నుంచే బదిలీల ప్ర‌క్రియ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఏపీ సర్కార్ ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీలోపు బదిలీలు పూర్తి చేయాలని సచివాలయ శాఖ అడుగులు వేస్తోంది. సచివాలయాలలో ఉద్యోగుల ఖాళీల వివరాలు ఉమ్మడి జిల్లాలో వారీగా నేడు ప్రకటించనున్నారు. ఇక అర్హులైన ఉద్యోగులు నేటి నుంచి ఈ నెల 24వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక ఈ నెల 25, 26వ తేదీలలో ఉద్యోగుల దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. అనంత‌రం అభ్యర్థుల తుది సీనియారిటీ జాబితాను జిల్లా స్థాయిలో వెల్లడిస్తారు. తుది జాబితాలను ఈ నెల 26వ తేదీన పరిశీలించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాఖధిపతులకు పంపిస్తారు కలెక్టర్లు. అనంతరం 27, 28 తేదీలలో ఆ జాబితాను పరిశీలించి, మళ్లీ ప్రభుత్వానికి నివేదిస్తారు శాఖధిపతులు. ఇక చివరిగా ఈ నెల 29వ తేదీన ఉద్యోగుల బదిలీ తుది జాబితా వెలువడుతుంది. అభ్యంతరాలు ఉంటే, ఈ నెల 30వ తేదీలోపు పరిష్కరించనుంది సచివాలయ శాఖ.

Next Story