విహార యాత్రలో విషాదం.. డ్యాంలో ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-23 13:32:19  IST  )

విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది...

విహార యాత్రలో విషాదం.. డ్యాంలో ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్: విహార యాత్ర(Excursion)లో విషాదం చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం సివి(CV)ని గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆదివారం కావడంతో జంఝావతి రబ్బర్ డ్యాం(Janjhavati Rubber Dam)కు వెళ్లారు. డ్యాంలో దిగి ఈత కొడుతుండగా నీటిలో గల్లంతయ్యారు. కొద్దిసేపటికే నీటిలో మునిగిపోయి కొట్టుకుపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు.. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story