కృష్ణా జిల్లాలో విషాదం... పోలవరం కాలువలో పడి ఇద్దరు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-23 12:18:41  IST  )

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది..

కృష్ణా జిల్లాలో విషాదం... పోలవరం కాలువలో పడి ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లాలో విషాదం(Tragedy) చోటు చేసుకుంది. బాపులపాడు మండలం వీరవల్లి(Verravalli) వద్ద పోలవరం కాలువ(Polavaram canal)లో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. చేపలు పట్టేందుకు పోలవరం వద్దకు ఇద్దరు యువకులు(Two Young Men) వెళ్లారు. చేపలు పట్టే సమయంలో తొలుత ఓ యువకుడు కాలువలో పడ్డారు. దీంతో స్నేహితుడు రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెండో యువకుడు కూడా కాలువలో పడ్డారు. వెంటనే ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈత రాకపోవడంతో నీటిలో ఊపిరాడక మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈతగాళ్ల సహాయంతో యువకుల మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీశారు. నాగూర్‌ బాషా, షేక్‌ షరీఫ్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. యువకుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకులు కాలువల వద్దకు వెళ్లొద్దని, ఈత, చేపల పట్టే పేరుతోనే ప్రాణాలపైకి తీసుకోవద్దని సూచించారు. ఒక వేళ ఈత కోసం వెళ్తే నిపుణులను వెంట తీసుకెళ్లాలని పోలీసులు తెలిపారు.

Next Story