Chittoor: చిత్తూరు జిల్లాలో విషాదం.. ఏనుగుల దాడిలో రైతు మృతి

by Ramesh Naini |

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

Chittoor: చిత్తూరు జిల్లాలో విషాదం.. ఏనుగుల దాడిలో రైతు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుర్మానిపల్లి గ్రామానికి చెందిన రైతు కిట్టప్ప (64)ను ఏనుగులు దాడి చేసి చంపేశాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కిట్టప్ప తన రాగి పంటకు కాపలా కాయడానికి రాత్రి పొలానికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున అడవిలో నుంచి బయటకు వచ్చిన ఏనుగులు పొలంలోకి ప్రవేశించి పంటను నాశనం చేయడం ప్రారంభించాయి. వాటిని తరిమివేయాలనుకున్న కిట్టప్పపై ఏనుగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. పొలం వద్ద రైతు ఉంటున్న గుడిసెను ఎనుగులు పూర్తిగా ధ్వంసం చేశాయి. స్థానికులు ఘటనాస్థలికి చేరుకునేసరికి కిట్టప్ప అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.

ఈ సమాచారం అందుకున్న కుప్పం అటవీ శాఖ అధికారి జయశంకర్, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయ నెలకొంది. ఏనుగుల సంచారం కారణంగా భయాందోళనకు గురవుతున్న పరిసర గ్రామాల ప్రజలు రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అడవి జంతువుల నుంచి పంటలు, ప్రజలను కాపాడేందుకు అటవీ శాఖ తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో ఇదే..

Next Story