- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Heavy Rain:రాష్ట్రంలో కుండపోత వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం
గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో వాతావరణం మేఘావృతమై ఉంటుంది.

దిశ,వెబ్‌డెస్క్: గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో వాతావరణం మేఘావృతమై ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు(Heavy Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇవాళ(ఆదివారం) ఏపీ(Andhra Pradesh)లోని కర్నూలు, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, అమలాపురం, తూర్పు గోదావరి, అల్లూరి జిల్లాల్లో కుండపోత వాన పడుతోంది.
ఈ భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో చెట్లు నేలకొరిగాయి. ఉరుములు, మెరుపులతో పలు చోట్ల పిడుగులు(thunderbolts) ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రాబోయే మూడు రోజులు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ క్రమంలో ఏపీని రేపు(సోమవారం) నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) తాకనున్నాయి. దీంతో మరో 24 గంటల్లో రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దీంతో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.






