కిలో రూ.2కే టమాటా.. నేలపై పారబోసిన రైతులు

by Vemula.Srinu Prasad |

పత్తికొండ మార్కెట్‌లో భారీగా టమాటా ధరలు పడిపోయాయి...

కిలో రూ.2కే టమాటా.. నేలపై పారబోసిన రైతులు
X

దిశ, వెబ్ డెస్క్: నిన్న ఉల్లి, నేడు టమాటా(tomato) ధరలు(Price) భారీగా పడిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్‌లో రూ.5 కే కేజీ ఉల్లి పాయలు దొరకగా.. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్(Pattikonda Market)లో టమాటా రూ.2 పలికింది. 60 కేజీల తట్ట రూ. 40 పలకడంతో ఆందోళన వ్యక్తం చేశారు. గిట్టుబాటు లేదని టమాటాలను కొందరు రైతులు మార్కెట్ వద్ద నేలపై పారబోశారు. కనీసం ఆటో చార్జీలు కూడా రావడం లేదని వాపోయారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు.

అయితే విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే.. టమాటా రైతుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు రైతుల నుంచి రూ.8కి టమాటా కొనుగోలు చేయాలని ఆదేశించింది. దీంతో రైతులు కొంత వరకు హర్షం వ్యక్తం చేశారు.

Next Story