- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదంలో తిరుపతి బస్టాండ్.. వణికి పోతున్న ఉద్యోగులు
తిరుమల(Tirumala) కొండపై కొలువుదీరిన శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలివస్తారు

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) కొండపై కొలువుదీరిన శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలివస్తారు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండకు చేరుకుని శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతూ, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కొలువున్న తిరుపతి బస్ స్టాండ్(Tirupati Bus Stand) బిల్డింగ్ పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది.
చాలా ఏళ్ల క్రితం నిర్మించిన బస్ స్టాండ్ భవనానికి మరమ్మతులు చేయించక పోవడంతో భవనం పై కప్పు అక్కడక్కడ పెచ్చులూడి పోతుంది. వర్షాకాలంలో భవనం స్లాబ్ పైన నీరు నిలిచి పెచ్చులూడిన చోట నీరు లీకేజీ అవుతుంది. పలుమార్లు పెచ్చులు కూడా ఊడిపడ్డాయని బస్ స్టాండ్ ఎంక్వయిరీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తెలిపారు. వర్షాకాలంలో సీలింగ్ తడిసి ఏ క్షణాన ఊడి పడుతుందోనని భయం భయంగా డ్యూటీ చేయాల్సి వస్తోందని ఆర్టీసీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణీకులకు కూడా ప్రమాదమేనని త్వరగా మరమ్మతులు చేయిస్తే బాగుంటుందని అక్కడి సిబ్బంది, బస్ స్టాండ్ లో వివిధ షాపులు నిర్వహిస్తున్న వారు పేర్కొన్నారు.






