తిరుమల శ్రీవారిపై పగ పట్టారు.. కక్ష గట్టారు: మండలిలో అనురాధ తీవ్ర ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-04 08:26:29  IST  )

ఏపీ శాసనమండలిని తిరుమల లడ్డూ నెయ్యి అంశం కుదిపేసింది. కూటమి, వైఎస్ జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని టీడీపీ ఎమ్మెల్సీ అనూరాధ మండిపడ్డారు.

తిరుమల శ్రీవారిపై పగ పట్టారు.. కక్ష గట్టారు: మండలిలో అనురాధ తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ శాసనమండలి(AP Legislative Council)ని తిరుమల లడ్డూ నెయ్యి(Tirumala Laddu Ghee) అంశం కుదిపేసింది. కూటమి, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జగన్ హయాంలో తిరుమల శ్రీవారి పవిత్రతకు తీవ్ర భంగం కలిగించారని ఎమ్మెల్సీ అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూకు వినియోగించిన నెయ్యిలో రసాయలు కలిపారని సిట్ చార్జిషీట్ ఉన్నా వైసీపీ సభ్యులు బుకాయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా సుబ్బారెడ్డి నెయ్యి టెండర్లు నిర్వహించారని అనురాధ ఆరోపించారు. వైఎస్ ఉన్నప్పుడు కూడా తిరుమలపై కక్ష గట్టారని, ఇప్పుడు జగన్ కూడా అదే పని చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. జంతు కొవ్వు, పంది కొవ్వు అవశేషాలున్నాయని ఎన్డీడీబీ రిపోర్టు చెప్పిందని ఎమ్మెల్సీ అనూరాధ గుర్తు చేశారు.

సిట్‌పై నమ్మకం లేక సుప్రీంకోర్టుకు వెళ్లారు..

రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌పై నమ్మకం లేక అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారని ఎమ్మెల్సీ అనూరాధ తెలిపారు. లడ్డూ నెయ్యిని కల్తీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీవారి భక్తులకు క్షమపణలు చెప్పాలని అనురాధ డిమాండ్ చేశారు. జగన్ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డుపై విషం చిమ్మారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీలో ఏ1 జగన్ మోహన్ రెడ్డి, A2 సుబ్బారెడ్డి, A3 కరుణాకర్ రెడ్డి, A4 ధర్మారెడ్డి, A5 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఎమ్మెల్సీ అనురాధ తెలిపారు. సంబంధం లేని సంస్థలను లడ్డూ అంశంలోకి తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు.

Next Story