స్కూల్‌లో దారుణం.. మూడేళ్ల చిన్నారి ప్రైవేట్ పార్ట్స్‌పై తీవ్ర గాయాలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-06 13:15:00  IST  )

రాష్ట్రంలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

స్కూల్‌లో దారుణం.. మూడేళ్ల చిన్నారి ప్రైవేట్ పార్ట్స్‌పై తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్వయంగా స్కూళ్లో మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ పోసి దాడి చేసింది. ఈ ఘటన విజయవాడ(Vijayawada)లోని విద్యాధరపురం నేషనల్ స్కూల్‌(Vidyadharapuram National School)లో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దాడి అనంతరం చిన్నారి పేరెంట్స్‌కు స్కూల్ యాజమాన్యం ఫోన్ చేసి.. బాత్‌రూమ్‌లో పడిపోయిందని చెప్పారు. దీంతో హుటాహుటిన స్కూల్‌కు వచ్చిన తల్లిదండ్రులు పాపను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు యాసిడ్ దాడిగా నిర్దారించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story