Ap: ఒకే కుటుంబంలో ముగ్గురికి కానిస్టేబుల్ జాబ్స్

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా గుత్తిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కానిస్టేబుల్ జాబ్స్ వచ్చాయి.

Ap: ఒకే కుటుంబంలో ముగ్గురికి కానిస్టేబుల్ జాబ్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాలు(Police Constable Jobs Results) విడుదల అయ్యాయి. అయితే ఈ ఫలితాల్లో అనంతపురం జిల్లా గుత్తి(Anantapur District Guthi)కి చెందిన ముగ్గురు సోదరులు సత్తా చాటారు. గుత్తికి చెందిన మహబూబ్ దౌలా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆయన ముగ్గురు కుమారులు మహమ్మద్ అలీ, మహమ్మద్ గౌస్, మహమ్మద్ సమీర్‌కు కానిస్టేబుల్ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకే కుటుంబంలో, అదీ ముగ్గురు సోదరులకు పోలీస్ జాబ్స్ రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది

Next Story