- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీని ఢీ కొట్టిన బస్సు.. ముగ్గురు స్పాట్ డెడ్
by Naga Rani Yarlagadda |
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. శ్రీనగర్ కాలనీ వద్ద ఆగి ఉన్న లారీని.. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో స్పాట్ లోనే డ్రైవర్ సహా మరో ఇద్దరు మహిళలు మరణించారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్సులో కేజీహెచ్ కు తరలించారు. ఆర్టీసీ బస్సు.. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరణించినవారి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి, బంధువులకు సమాచారమిచ్చారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
Next Story






