- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.40 వేల లంచం.. ముగ్గురు అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం
ఏసీబీ వలలో ముగ్గురు అవినీతి అధికారులు పడ్డారు...

X
దిశ, వెబ్ డెస్క్: ఏసీబీ(ACB) వలలో ముగ్గురు అవినీతి అధికారులు పడ్డారు. పక్కా సమాచారంతో లంచం తీసుకుంటుండగా కాకినాడ(Kakinada) బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్(BC Welfare Deputy Director) లల్లితో పాటు అసిస్టెంట్ సూర్య శివప్రసాద్, మాజీ ఉద్యోగి సత్యనారాయణను పట్టుకున్నారు. పని నిమిత్తం కార్యాలయానికి వచ్చిన వ్యక్తి వద్ద లంచం డిమాండ్ చేశారు. పని పూర్తి చేసేందుకు రూ. 40 వేలు ఇవ్వాలని అడిగారు. దీంతో ఏసీబీ అధికారులను సదరు వ్యక్తి ఆశ్రయించారు. ఈ మేరకు బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంపై అధికారులు రైడ్ చేశారు. లంచం తీసుకుంటుండగా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లల్లి, అసిస్టెంట్ సూర్య శివప్రసాద్, మాజీ ఉద్యోగి సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
Next Story






