- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh:మహాకుంభమేళాకు మంత్రి నారా లోకేష్.. షెడ్యూల్ ఇదే!
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్(Prayagraj)లో మహాకుంభమేళా(Mahakumbh Mela) కోలాహలంగా జరుగుతోంది.

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్(Prayagraj)లో మహాకుంభమేళా(Mahakumbh Mela) కోలాహలంగా జరుగుతోంది. ఈ కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు(Devotees) భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ తరుణంలో మహాకుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ప్రయోగరాజ్‌కు ఈ రోజు(సోమవారం) బయలుదేరి వెళ్లారు. ఉదయం10 గంటలకు మంత్రి లోకేష్ ప్రయాగ్‍రాజ్ లోని షాహి స్నానఘట్టానికి చేరుకుంటారు.
ఉదయం 10.10 నుంచి 12.10 గంటల మధ్య మహా కుంభమేళా షాహి స్నానఘట్టంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. మధ్యాహ్నం 1.00 గంటకు ప్రయాగ్‍రాజ్ నుంచి వారణాసికి పయానమవుతారు. మధ్యాహ్నం 2.45 గంటలకు వారణాసి(Varanasi) కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 3.40 గంటలకు వారణాసి కాశీ విశ్వేశ్వర ఆలయం సందర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు విశాలాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5.25 గంటలకు వారణాసి నుంచి విజయవాడ(Vijayawada) తిరుగు ప్రయాణం అవుతారు.






