హైదరాబాద్ శివారులో భారీ చోరీ.. 30 కిలోల వెండి, 30 తులాల బంగారం అపహరణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-08-07 04:33:47  IST  )

హైదరాబాద్ శివారులో దొంగలు రెచ్చిపోయారు..

హైదరాబాద్ శివారులో భారీ చోరీ.. 30 కిలోల వెండి, 30 తులాల బంగారం అపహరణ
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ శివారులో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఓ జువెలరీ షాపులోకి చొరబడి దొంగతనం చేశారు. 30 కిలోల వెండితో పాటు 30 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. మేడ్చల్ జిల్లా శామిర్ పేట మండలం తూముకుంటలో జరిగింది. దొంగతనం జరిగిన షాపును ఈ ఉదయం స్థానికులు గమనించారు. వెంటనే షాపు యజమానికి సమాచారం అందించారు. దీంతో ఆయన షాపు వద్దకు వెళ్లి చూడగా వెండి, బంగారం మొత్తం కనిపించలేదు. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. హైదరాబాద్ శివారు ప్రాంత శివారు ప్రాంత ప్రజలు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల కదలికలపై తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

Next Story