- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత.. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లి రెవెన్యూ భవన్‌కు తాళం
by Vemula.Srinu Prasad |
అనంతపురం కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది..

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం కలెక్టరేట్(Anantapur Collectorate) వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(Rural Development Trust)కి విదేశీ నిధులు నిలుపుతున్నారంటూ ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లారు. బారికెడ్లు తోసేసి మరి కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లారు. సేవ్ RTD అంటూ నినాదాలు చేశారు. జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు ఉన్న రెవెన్యూ భవన్‌కు తాళాలు వేశారు. అధికారులతో దళిత సంఘం నేతల వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే పోలీసులను నెట్టుకుని మరీ ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్‌కి విదేశీ నిధులు ఆపొద్దని డిమాండ్ చేశారు. ఆపితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Next Story






