Ration card: రేషన్ కార్డు దరఖాస్తుకు గడువు లేదు.. ప్రజలు తొందర పడొద్దు

by Thanuru Gopichand |

రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదు.. అర్హత ఉన్న వారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు.. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ.. ప్రజలు తొందరపడకండి..

Ration card: రేషన్ కార్డు దరఖాస్తుకు గడువు లేదు.. ప్రజలు తొందర పడొద్దు
X

అర్హత ఉన్న వారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు

దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఇస్తున్నాం

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

దిశ, డైనమిక్ ​బ్యూరో : రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదు.. అర్హత ఉన్న వారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు.. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ.. ప్రజలు తొందరపడకండి.. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఇస్తున్నాం.. అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ వైట్ కార్డు లు అందిస్తాం అన్నారు. కేంద్రం ఈకేవైసీని (EKYC) తప్పనిసరి చేసిందని.. దేశంలో 95శాతం ఈకైవైసీ పూర్తిచేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. కొత్త రైతు కార్డుల కోసం అరవై వేల మంది దరఖాస్తు చేశారని తెలిపారు. వీటికి మ్యారెజ్ సర్టిఫికేట్ అవసరం లేదు.. పెళ్లి ఫొటో కూడా అక్కర్లేదు అన్నారు. సర్వర్ డౌన్ కావడం, సచివాలయాల్లో అప్లికేషన్లు పూర్తిగా తీసుకోలేక పోవడం వంటి వాటితో ఇబ్బంది కలిగిందన్నారు. సాంకేతికపరమైన లోపాలతో వల్ల ఇబ్బంది కలిగినందుకు ప్రజలకు క్షమాపణ చెబుతున్నాం అన్నారు. వచ్చే జూన్​నెలలో 4,24,59,128 మందికి మేమే ఉచితంగా రైస్ కార్డులను జారీ చేస్తున్నాం అన్నారు. కార్డుదారుల సమాచారం డేటా బేస్ లో పెట్టి.. ప్రజలకు స్మార్ట్ రైస్ కార్డులు (Rice Cards) అందిస్తాం అన్నారు. కార్డులో కొత్తగా పేర్లు ఎక్కించాలన్నా ఒక పేరు తొలగించాలంటే.. తప్పకుండా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలని తెలిపారు.

జూన్​1 నుంచి రేషన్​షాపు ద్వారానే సరకులు..

ఎండీయూ వాహనాలు రద్దు చేసిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లీం, మైనారిటీ, కార్పోరేషన్ల ద్వారా వాహనాలు వారికే ఇవ్వాలని నిర్ణయించాం అన్నారు. ప్రభుత్వంపై ఆర్ధిక భారం ఉన్నప్పటికీ.. వారికి ఉపాధి ఇచ్చేలా వాహనాలు ట్రాన్స్ ఫర్ చేయాలని ఐదు కార్పోరేషన్లకు ఆదేశించామని తెలిపారు. ప్రభుత్వం నుంచి జీవో వచ్చాక.. వాహనాలు కూడా లబ్దిదారుల పేర్లతోనే అందిస్తాం అన్నారు. 90శాతం మంది ప్రజలు రేషన్ షాపులద్వారానే ఇవ్వాలని మా సర్వేలో రిపోర్టు వచ్చిందన్నారు. జూన్ 1 నుంచి రేషన్ షాపులద్వారానే సరుకులు పంపిణీ చేస్తాం అన్నారు. వృద్దులు, వికలాంగులకు వారి ఇళ్లకు వెళ్లి అందిస్తాం అన్నారు.

Next Story