రైలు పైకి ఎక్కి యువకుడి హంగామా..

by Thanuru Gopichand |

ఎక్కడి నుంచి వస్తార్రా బాబూ ఇలాంటోళ్లంతా.

రైలు పైకి ఎక్కి యువకుడి హంగామా..
X

దిశ, వెబ్ డెస్క్ : రైలెందుకు ఎక్కావు.. దిగవయ్యా బాబు అని ఓ యువకుడిని ప్రయాణికులు బ్రతిమిలాడారు. అయినా ఎంతకీ కిందకు దిగిరాలేదు. చాలా సేపు బ్రతిమిలాడినా తగ్గేది లేదంటూ రైలుపైనే కూర్చున్నాడు. దీంతో రైలు ముందుకు కదలడంలో ఆలస్యమైపోతూ ఉంది. ఇదంతా గమనిస్తున్న ఓ రైలు ప్రయాణికుడు ఓపిక పట్టలేక ఇక రైలుపైకి ఎక్కాడు.. ముప్పుతిప్పలు పెడుతున్న ఆ యువకుడిని రైలు పై నుంచి కిందకు నెట్టే ప్రయత్నం చేశాడు. అనుకున్నట్లుగానే ఇతర ప్రయాణికుల సహకారంతో యువకుడిని రైలు కిందకు దింపారు. ఇక ఉక్రోశం పట్టలేని కొందరు ప్రయాణికులు ఆ యువకుడికి దబిడిదిబిడి చేశారు. అనంతరం రైల్వే పోలీసులకు అప్పగించారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది చూసిన వారంతా ఇదెక్కడి పిచ్చిరా నాయనా అనుకుంటున్నారు. అయితే ఆ యవకుడికి నిజంగానే పిచ్చి ఉందని విచారణలో తెలిసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట రైల్వే స్టేషనులో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు సోంపేట రైల్వే స్టేషనులో (Sompeta Railway Station) ఆగింది. ప్రయాణికులు కొందరు కిందకు దిగారు. ఈ క్రమంలో గుర్తింపు తెలియని ఓ యువకుడు రైలు బోగీపైకి ఎక్కి కూర్చున్నాడు. ఇది గమనించిన ప్రయాణికులు అతడిని కిందకు దిగవలసిందిగా బ్రతిమిలాడారు. అలా ఎంతసేపు బ్రతిమిలాడినా సదరు యువకుడు (Youth) తాను దిగడానికి ససేమిరా అన్నాడు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లోకి ప్రయాణికులు వెళ్లాడు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు పెద్ద సాహసమే చేశాడు. బోగీపైకి ఎక్కి సదరు యువకుడిని బోగీపై నుంచి కిందకు తోసేశాడు. కింద ఉన్న ప్రయాణికుడు ఆ యువకుడిని పట్టుకొని కిందకు లాగారు. తమను విసిగించిన అతడిని చడామడా వాయించడం మొదలుపెట్టారు. అతని ప్రాణాలతో పాటు ఇతర ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసేలా వ్యవహరించడంపై ఆగ్రహాన్ని ప్రదర్శించారు. అనంతరం రైల్వే పోలీసులకు అప్పగించారు. తీరా చూస్తే అతనికి మతి స్థిమితం లేక అలా చేశాడని రైల్వే అధికారులు చెప్పేశారు. విషయం తెలుసుకొని ప్రయాణికులు ముక్కున వేలేసుకున్నారు.

Next Story