మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌‌పై ఫ్యాషన్ డిజైనర్ ఫిర్యాదు.. మహిళా కమిషన్ సీరియస్

by Vemula.Srinu Prasad |

కర్నూలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే హపీజ్ ఖాన్‌పై మహిళా కమిషన్ సీరియస్ అయింది..

మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌‌పై ఫ్యాషన్ డిజైనర్ ఫిర్యాదు.. మహిళా కమిషన్ సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే హపీజ్ ఖాన్‌(Former Kurnool YCP MLA Hafeez Khan)పై మహిళా కమిషన్ సీరియస్(Women Commission is serious.) అయింది. వైఎస్ జగన్(Ys Jagan) ప్రభుత్వం హయాంలో కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానని రూ.3.70 కోట్లు తీసుకున్నారని ఫ్యాషన్ డిజైనర్ పి. శోభారాణి(Fashion designer P. Shobharani) ఫిర్యాదు చేశారు. తనకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్లకు ఇప్పించుకున్నారని ఆరోపించారు. తన వద్ద డబ్బు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదు చేశారు. గతంలోనే ఆమె ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. హఫీజ్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మహిళా కమిషన్ స్పందించారు. హఫీజ్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎస్పీని మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు త్వరలోనే ఆయనపై పోలీసులు చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారంలో హఫీజ్ ఖాన్‌కు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story