రైల్వే కోడూరు కోర్టుకు హర్షవీణ.. హైకోర్టు ఆదేశాలతో బెయిల్ షూరిటీలు దాఖలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-06 11:44:28  IST  )

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు రైల్వే కోడూరు కోర్టుకు హాజరయ్యారు. తన కుమారుడిని హర్ష వీణ వేధిస్తోందని ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ...

రైల్వే కోడూరు కోర్టుకు హర్షవీణ.. హైకోర్టు ఆదేశాలతో బెయిల్ షూరిటీలు దాఖలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Jana Sena MLA Arava Sridhar) బాధితురాలు రైల్వే కోడూరు కోర్టు(Railway Kodur Court)కు హాజరయ్యారు. తన కుమారుడిని హర్ష వీణ వేధిస్తోందని ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటికే హర్షవీణ హైకోర్టు(High Court) నుంచి బెయిల్(Bail) పొందారు. కానీ ఇందుకు సంబంధించిన షూరిటీలు మాత్రం స్థానిక కోర్టులోనే సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసుకు సంబంధించి శుక్రవారం హర్షవీణ కోర్టుకు వెళ్లారు. బెయిల్ మంజూరుకు సంబంధించి షూరిటీలు దాఖలు చేశారు. అనంతరం హర్షవీణ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ప్రతి శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని హర్షవీణను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శనివారం రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్‌లో హర్షవీణ హాజరై సంతకం చేయనున్నారు. కాగా యూట్యూబర్‌ను దాడి చేసి, నిర్బంధించిన మరో కేసులోనూ హర్షవీణ ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారు.

హర్షవీణ కోర్టుకు హాజరైన దృశ్యాలు

Next Story