భక్తులకు ముఖ్య గమనిక.. శ్రీవారి సాలకట్ల జ్యేష్టాభిషేకం ఎప్పటినుంచంటే..!

by Vemula.Srinu Prasad |

శ్రీవారి సాలకట్ల జ్యేష్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ అయింది....

భక్తులకు ముఖ్య గమనిక.. శ్రీవారి సాలకట్ల జ్యేష్టాభిషేకం ఎప్పటినుంచంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు తిరుమల‌ శ్రీవారి ఆలయం(Tirumala Srivari Temple)లో సాలకట్ల జ్యేష్టాభిషేకం(Salakatla Jyeshtabhishekam) జ‌రగ‌నుందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల‌ పాటు శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో ఈ క్రతువును నిర్వహించనున్నట్లు చెప్పారు. జ్యేష్టాభిషేకాన్ని ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారని, తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు.

మొదటిరోజు శ్రీ మలయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారని చెప్పారు. రెండవరోజు ముత్యాల‌ కవచం సమర్పిస్తారని, మూడవరోజు తిరుమంజనాదులు పూర్తి చేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారన్నారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారని, అంతవరకు బంగారు కవచంతోనే శ్రీవారు వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారని టీటీడీ అధికారులు తెలిపారు.

Next Story