తీవ్ర ఉత్కంఠ.. విజయం ఎవరిదో..?

by Vemula.Srinu Prasad |

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరిలో ఈ రోజుకు కింగ్ ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది.

తీవ్ర ఉత్కంఠ.. విజయం ఎవరిదో..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Ap Former Cm Pawan Kalyan), ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ఇద్దరిలో ఈ రోజుకు కింగ్ ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. అయితే ముందే అలర్ట్ అయిన వైసీపీ ఈ రోజును వెన్ను పోటు దినంగా ప్రకటించి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో కౌంటర్‌గా రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు నిర్వహించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. ఇటు వైసీపీ(Ycp), అటు జనసేన(Janasean) పార్టీలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సర్వంసిద్ధమైంది. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నిరసన కార్యక్రమాలకు ప్రయత్నం చేస్తోంది. అటు జనసైనికులు కూడా సంబురాలు రెడీ అయ్యారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో వివరించేందుకు జనసేన లిస్టు రెడీ చేసింది. ఈ సంవత్సరంలో ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపేందుకు లిస్టు సిద్ధం చేసింది.

ఈ మేరకు ఇప్పుడిప్పుడే వైసీపీ, జనసేన నాయకులు రోడ్లపైకి వస్తున్నారు. అయితే తెనాలిలో మంగళవారం జగన్ పర్యటనలో నెలకొన్న ఉద్రిక్తతలతో రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వేడి కొనసాగుతోంది. మరికాసేపట్లో రెండు పార్టీలు చేయబోయే కార్యక్రమాలతో ప్రస్తుతం టెన్షన్ వాతావరణ కొనసాగుతోంది. కానీ ఈ రోజు తమ కార్యక్రమం విజయవంతం అవుతోందని రెండు పార్టీ నాయకులు జబ్బలు చరుస్తున్నారు. తమ తమ అధినేతలే కింగ్ అని చెప్పుకుంటున్నారు.

అయితే పోటీపోటీగా చేయబోతున్న ఈ కార్యక్రమాలతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పితే పరిస్థితేంటని పలువురు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. శాంతి యుతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. జగన్, పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తలు భారీగా ఉన్న నేపథ్యంలో తమ అధినేతే ‘కింగ్’ అని పరస్పరం పార్టీ నేతలు, కార్యక్రమాలు దీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అసాంఘిక ఘటనలు జరిగినా కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరించారు. పకడ్బందీగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.. మరి ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి..

Next Story