ఆ ఆలయంలో ముగ్గురు శాశ్వత ఉద్యోగుల సస్పెన్షన్.. కారణమిదే?

by Jakkula.Mamatha |

శ్రీశైలం ఆలయంలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు.

ఆ ఆలయంలో ముగ్గురు శాశ్వత ఉద్యోగుల సస్పెన్షన్.. కారణమిదే?
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రీశైలం ఆలయంలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. ఉద్యోగి విద్యాధర్‌ హుండీ సొమ్ము కాజేశాడు. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి హుండీ లో రూ.24,644 నగదును చోరీ చేశారు. బుధవారం తెల్లవారుజామున విధులకు వచ్చిన ఆయన.. డబ్బులు ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అతనిని అధికారులు పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. ప్రాథమికంగా విద్యాధర్‌ను విధుల నుంచి తొలగించారు. స్థానిక పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీశైలం దేవస్థానంలో నిన్న(బుధవారం) ఆలయ హుండీ సొమ్ము చోరీపై నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన ఉదోగుల పై ఆలయ ఈవో శ్రీనివాసరావు చర్యలు తీసుకున్నారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన నలుగురు సెక్యూరిటీ గార్డులను తొలగించారు. ముగ్గురు శాశ్వత ఉద్యోగులను ఆలయ ఈవో శ్రీనివాసరావు సస్పెన్షన్ చేశారు.

Next Story