- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: రాష్ట్ర మున్సిపల్ శాఖ కీలక ఆదేశాలు
రాష్ట్రంలో కల్తీ పాల ఘటన, కలుషిత నీరు తాగి ఇటీవల జరిగిన ఘటన దృష్ట్యా అధికారులకు రాష్ట్ర మున్సిపల్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కల్తీ పాల(Adulterated milk) ఘటన, కలుషిత నీరు(Contaminated water) తాగి ఇటీవల జరిగిన ఘటన దృష్ట్యా అధికారులకు రాష్ట్ర మున్సిపల్ శాఖ(Municipal Department) కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని మున్సిపాలిటీల్లో డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే సురక్షిత నీటినే ప్రజలకు అందించేలా చూడాలి ఎస్‌వోపీ జారీ చేసింది. మున్సిపాలిటీల్లో తాగునీరు కలుషితం అయిన ఘటనలు చోటు చేసుకుంటే అది కమిషనర్లదే బాధ్యత అని, అసలు ఉపేక్షించేది లేదని ఆదేశించింది. రాష్ట్రవ్యాపంగా అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి పైప్‌లైన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని కమిషనర్లను ఆదేశాలు జారీ చేసింది. తాగునీటి పైప్‌లైన్లు డ్రైనేజీల ద్వారా వెళ్తే వెంటనే మార్చాలని సూచించింది. అలాగే డ్రైనేజీల్లో నీరు నిల్వ లేకుండా వెంటనే డీసిల్టేషన్ చేయాలని తెలిపింది. తాగునీటిపై ఫిర్యాదులు, సీజనల్ వ్యాధులపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు పనిచేసేలా చూడాలని కమిషన్లను మున్సిపల్ శాఖ ఆదేశించింది.






