రాష్ట్రంలో మాడుపగిలేలా ఎండలు.. నెల్లూరులో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-29 11:46:21  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా సూర్యడు సుర్రుమనిపిస్తున్నారు. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది..

రాష్ట్రంలో మాడుపగిలేలా ఎండలు.. నెల్లూరులో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సూర్యడు(Sun) సుర్రుమనిపిస్తున్నారు. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరింది. తాజాగా అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. మిగిలిన జిల్లాల్లో కూడా మెర్క్యురీ 40 డిగ్రీల మార్కును దాటేయడంతో ఉదయం 9 గంటల నుంచే బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. వేడి గాలుల ధాటికి రహదారులన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి.

విపరీతంగా వడగాలుల తీవ్రత

మరోవైపు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత విపరీతంగా పెరిగింది. పొడి గాలుల ప్రభావంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని సూచించింది. తగినన్ని నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు సూచించింది. ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Next Story