అసెంబ్లీ సమావేశాలు.. తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-11 07:29:50  IST  )

ఏపీ అసెంబ్లీ సమావేశాలను మార్చి 7 వరకు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది..

అసెంబ్లీ సమావేశాలు.. తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాల(AP Assembly Sessions)ను మార్చి 7 వరకు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం(State Govt) నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీ ఉభయ సభల కొనసాగింపుపైనా బీఏసీ సమావేశం(BAC meeting)లో సభ్యులు చర్చించారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశం ముగిసిన వెంటనే అసెంబ్లీ హాలులో బీసీఏ సమావేశం జరిగింది. ఈ నెల 14న రాష్ట్ర బడ్జెట్ పెట్టాలని నిర్ణయించారు. మరింత చర్చలు అవసరమైతే పొడిగించాలని సైతం నిర్ణయించారు. మొత్తం 17 రోజుల పాటు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీలో ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 17, 18న బడ్జెట్‌పై చర్చించనున్నారు. ఈ నెల 16న మహాశివరాత్రి సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 18న బడ్జెట్‌పై ప్రశ్నోత్తరాలకు ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై మొత్తం 8 రోజుల పాటు చర్చ జరగనుంది. మార్చి 1,2,3 సెలవు రోజులుగా ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకే ప్రశ్నోత్తరాలు ముగించనున్నారు. సమావేశాలు ముగిసే వరకూ ప్రతి రోజూ జీరో అవర్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 24, 25, 26వ తేదీల్లో ఎమ్మెల్యేలకు క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. అమరావతిలో మార్చి 6న సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆరు ఆర్డినెన్స్‌లకు అసెంబ్లీ ఆమోదించనుంది.

కాగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభయ్యాయి. సమావేశాలకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీకి రాని జగన్ కూడా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అయితే సభ ప్రారంభమైన పది నిమిషాలకే వైఎస్ జగన్ సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆ పార్టీ సభ్యులు సైతం అసెంబ్లీ నుంచి వాకౌట్ అయ్యారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ వాయిదా పడింది. ఆ తర్వాత ఆసెంబ్లీ హాలులోనే బీఏసీ మీటింగ్ నిర్వహించారు.

Next Story