మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు.. ఉత్తర్వులు జారీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-13 11:03:48  IST  )

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది...

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు.. ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు(Temperatures) పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి విద్యా సంవత్సరం ముగిసే వరకు పాఠశాలల్లో పాక్షిక పని దినాలు (హాఫ్‌డే స్కూల్స్) అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యా సంచాలకులు విజయ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ అలాగే గుర్తింపు పొందిన ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలన్నీ ఈ పని వేళలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం యథావిధిగా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కచ్చితంగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.

Next Story