- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికార టీడీపీకి బిగ్ షాక్.. రాజంపేట టీడీపీ కీలక నేత రాజీనామా
అధికార టీడీపీకి బిగ్ షాక్ తగిలింది...

దిశ, వెబ్ డెస్క్: అధికార టీడీపీ(TDP)కి బిగ్ షాక్ తగిలింది. ఈ పార్టీకి చెందిన కీలక నేత రాజీనామా చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట(Rajampet)కు చెందిన టీడీపీ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం(TDP leader Sugavasi Subramaniam) రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను సీఎం చంద్రబాబు(Cm Chandrababu)కు పంపారు. 2024 ఎన్నికల్లో రాజంపేట ఎమ్యెల్యే అభ్యర్థిగా పోటీ కేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత కొంతకాలంగా రాజంపేట టీడీపీలో వర్గ విబేధాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయన పార్టీకి దూరంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ అధికారం ఉన్నా సుబ్రహ్మణ్యం రాజీనామాతో ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలో సంచలనంగా మారింది.
అయితే రాజీనామా నిర్ణయం ఇప్పటిది కాదని లేఖలో సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఐదారు నెలల నుంచే ప్రజాభిప్రాయాలు సేకరించానని తెలిపారు. ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లో కొనసాగుతానని సుబ్రహ్మణ్యం చెప్పారు.కాగా గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. రాజంపేట అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లనూ వైసీపీ కైవసం చేసుకుంది.






