- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
బియ్యం మాయం కేసు: మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

దిశ, వెబ్ డెస్క్: బియ్యం మాయం(Rice Missing) వ్యవహారం రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani)కి చెందిన గోదాములో బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. పేర్ని ఫ్యామిలీపై కేసులు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. దీంతో పేర్ని నాని మాట్లాడుతూ తన కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బియ్యం మాయం కేసులో పేర్ని నాని చెప్పేవి కట్టుకథలని ఆయన వ్యాఖ్యానించారు. ఆడవాళ్లు, అరెస్ట్‌లంటూ పేర్ని నాని గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. సివిల్ సప్లై అధికారులు తనిఖీలకు వెళ్తే పారిపోయారని సెటైర్లు వేశారు. ఏ2తో సంబంధం లేదని పేర్నినాని తప్పించుకుంటున్నరన్నారు. తప్పు చేయకుంటే నాని ఫ్యామిలీ ఇంట్లోనే ఉండొచ్చు కధా అని ప్రశ్నించారు. బియ్యం మాయం కేసులో ఎవరూ తప్పించుకోలేరని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.