- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 16 రైళ్లు రద్దు
విశాఖ- విజయవాడ- లింగంపల్లి మధ్య వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ ముఖ్య గమనిక తెలిపింది....

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ- విజయవాడ- లింగంపల్లి మధ్య వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ ముఖ్య గమనిక తెలిపింది. ఈ రూట్లో రైల్వే ట్రాక్ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని, ఇందువల్ల 16 రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. జనవరి 27 నుంచి 31 తేదీల మధ్య ఈ రూటులో 16 రైళ్ల రాకపోకలు సాగవని వెల్లడించింది. ఆయా రైళ్ల జాబితాను రిలీజ్ చేసింది. విజయవాడ-విశాఖ, గుంటూరు-విశాఖ, లింగంపల్లి-విశాఖ, రాజమండ్రి-విశాఖ, తిరుపతి-పూరీ, తిరుపతి-విశాఖ, మచిలీపట్నం-విశాఖ, గుంటూరు-విశాఖ మధ్య సర్వీసులందించే రైళ్లు రద్దైన జాబితాలో ఉన్నాయని పేర్కొంది. ప్రయాణికులు ఈ సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ పేర్కొంది.
Next Story






