గంజాయి తరలింపులో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌.. మొత్తం ఏడుగురు అరెస్ట్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో గంజాయి రక్కసి ఆందోళనలు కలిగిస్తోంది. ..

గంజాయి తరలింపులో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌.. మొత్తం ఏడుగురు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో గంజాయి రక్కసి ఆందోళనలు కలిగిస్తోంది. అల్లరిమూకలే కాకుండా విద్యార్థులు, ఉద్యోగుల సైతం గంజాయి బారిన పడుతున్నారు. మహిళలు సైతం మత్తుకు బానిసలవుతున్నారు. గంజాయి సేవించడమే కాకుండా జల్సాలకు అలవాటు పడి అసాంఘిక కార్యక్రమాలకు సైతం పాల్పడుతున్నారు. గంజాయి సరఫరా చేసి దొరికిపోతున్నారు. చివరి అరెస్ట్ అయిన జైలు పాలువుతున్నారు.

ఇలాంటి ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. గంజాయి తరలిస్తున్న సమాచారంతో జిల్లాలోని నాతవరంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సహా ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. 73 కిలోల గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులు ఎవరు.. ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో విచారణ చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story