ఉత్సాహంగా పాకల బీచ్ ఫెస్ట్.. పోటెత్తిన పర్యాటకులు

by Vemula.Srinu Prasad |

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్ ఫెస్ట్ ఉత్సాహంగా కొనసాగుతోంది. శనివారం ప్రారంభమైన ఈ ఫెస్ట్ రెండో రోజు కూడా జరుగుతుండటంతో పర్యటకులు పోటెత్తారు...

ఉత్సాహంగా పాకల బీచ్ ఫెస్ట్.. పోటెత్తిన పర్యాటకులు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్ ఫెస్ట్ ఉత్సాహంగా కొనసాగుతోంది. శనివారం ప్రారంభమైన ఈ ఫెస్ట్ రెండో రోజు కూడా జరుగుతుండటంతో పర్యటకులు పోటెత్తారు. ఈ ఉత్సవాల్లో శనివారం జరిగిన ఈవెంట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రధానంగా హెలికాప్టర్ రైడింగ్, పారా గ్లైడింగ్, సముద్రంలో బోటు షికారు, బైక్ రైడింగ్‌తో పాటు గుర్రం, ఒంటెల సవారీలతో పెద్దలు, పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు. సీ ఫుడ్ వంటలు, పుడ్ స్ట్రాల్స్ భోజన ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరో వైపు పలు క్రీడా, సాంస్కృతిక, వినోద కార్యక్రమాల్లో కూడా పర్యాటకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక సాయంత్రం సమయంలో నిర్వహించిన బీచ్ వాలీబాల్, ఇతర క్రీడా పోటీలు సైతం నిర్వహించారు. సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేశారు. జబర్దస్త్ యాక్టర్ల స్కిట్లు, సింగర్లతో పాడించిన పాటలు పర్యటకులను ఆకట్టుకున్నాయి.

ఈ రోజు..

ఈ రోజు అర్ధరాత్రి వరకూ ఈ ఫెస్ట్ కొనసాగుతోంది. ప్రముఖ యాంకర్ సుమ నేతృత్వంలో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. బీచ్ ఒడ్డున సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలో ఏడు, ఎనిమిది వేల మంది పర్యాటకులు కూర్చొని కార్యక్రమాలను వీక్షించే విధంగా ఆకర్షణీయంగా సభను అలకరించారు. చిన్నారులు, యువతీ యువకుల ఎంటర్ టైన్ మెంట్ కోసం రంగుల రాట్నం, జేయింట్ వీల్ వంటివి సైతం ఏర్పాటు చేశారు. ఈ రోజు శివరాత్రి కావడంతో రాత్రి 12 గంటల వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

Next Story