బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థి పై కొనసాగుతున్న చర్చలు..ఈసారి స్థానికేతరుల కేనా?

by Disha Web Desk 18 |
బాపట్ల  టీడీపీ ఎంపీ అభ్యర్థి పై కొనసాగుతున్న చర్చలు..ఈసారి స్థానికేతరుల కేనా?
X

దిశప్రతినిధి, బాపట్ల:ఎంపీ అభ్యర్థి ఎవరనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ తరఫున ఉండవల్లి శ్రీదేవిని పరిశీలిస్తుండగా వైసీపీ అభ్యర్థిగా మరోసారి నందిగామ సురేష్ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉండేలా ఆ పార్టీ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. అయితే టీడీపీలో ఈ మధ్యకాలంలో దగ్గు మళ్ళ ప్రసాదరావు చాలా యాక్టివ్ గా బాపట్లలో తిరిగారు. పార్టీ అధినేత చంద్రబాబు ప్రసాద్ రావును చిత్తూరు ఎంపీగా పోటీ చేయాలనే ప్రతిపాదన చేసినట్లు తెలిసింది.దీంతో ప్రసాదరావు చిత్తూర్ కి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు.బాపట్ల ఎంపీ అభ్యర్థి గా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవి పేరును తెరపైకి తీసుకొచ్చి సర్వే నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అయితే మాల సామాజిక వర్గం మాత్రం ఈసారి తమకే కేటాయించాలని గట్టి డిమాండ్ చేస్తుంది. బాపట్ల ఎంపీ సీటు ఎవరనే దానిపై ఉత్కంఠత నెలకొంది.

బాపట్ల ఎంపీగా వైసీపీకి చెందిన ఉండవల్లి శ్రీదేవి టీడీపీ అధిష్టానం పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం ఉండవల్లి శ్రీదేవి గత ఎన్నికల్లో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత వైసీపీ ఆమెను సస్పెండ్ చేయడం తర్వాత జరిగిన పరిణామాల కారణంగా టీడీపీలో చేరారు. ఆమె బాపట్ల ఎంపీగా పోటీ చేస్తుందంటూ పుకార్లు షికార్లు చేశాయి. అదేవిధంగా ఆమె కూడా టీడీపీ నుంచి ఎంపీ స్థానాన్ని కోరుకుంటున్నట్లుగా సమాచారం. మాదిగ సామాజిక వర్గానికి ఎలాగైనా ఒక టికెట్ కేటాయించాలని చంద్రబాబు మదిలో ఉండటం దీంతో శ్రీదేవి మాదిగ సామాజిక వర్గం కావడంతో బాపట్ల నుంచి పోటీ చేసే విధంగా సర్వేలు నిర్వహిస్తున్నారు.

ఈ తరుణంలో బాపట్ల ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి గత కొన్ని సంవత్సరాలుగా ఐఆర్ఎస్ నుంచి విఆర్ఎస్ తీసుకొని చాలామంది అభ్యర్థులు ఎన్నికల ముందు వచ్చి హడావుడి చేసి సామాజిక వర్గాలుగా మీటింగ్లు పెట్టుకుని తనకే సీటు వస్తుందని విందులు వినోదాలు చేసి తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఈ తరుణంలోనే ఈ మధ్యకాలంలో దగ్గు మళ్ళీ ప్రసాదరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నానని మాజీ ఐఆర్ఎస్ బాపట్ల కు వచ్చి విందులు వినోదాలు చేసి కొంత హడావుడి చేశారు. కొంతమంది దగ్గు మళ్ళీ ప్రసాద్ కు టికెట్ వచ్చేసిందని కూడా చెప్పుకున్నారు.చంద్రబాబు వద్ద మాట తీసుకుని వచ్చారని చర్చించుకున్నారు. ఆ సమయంలో కూడా చంద్రబాబు బాపట్ల పార్లమెంటు పరిధిలోని రా కదిలి రా సభను ఏర్పాటు చేయగా అక్కడికి దగ్గు మళ్ళీ ప్రసాద్ వెళ్లి చంద్రబాబును కూడా కలిశారు. దీంతో ప్రసాద్ వచ్చిందని ఇక బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రసాద్ అంటూ పుకార్లు షికార్లు చేశాయి.

స్థానికేతరులకు ఇవ్వద్దు..

బాపట్ల ఎంపీ అభ్యర్థి స్థానికేతర్లకు ఇవ్వద్దంటూ ఎస్సీ సామాజిక వర్గం నుంచి తీవ్రమైన ఒత్తిడి టిడిపికి వస్తున్నట్లుగా సమాచారం ఈ నేపథ్యంలో ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులు ఒక కరపత్రాన్ని కూడా ప్రచురించి బాపట్ల పార్లమెంటులో పంచుతున్నారు. అదేవిధంగా బాపట్ల ఎంపీ అభ్యర్థులు ఎస్సీ మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని ఎందుకంటే బాపట్ల పార్లమెంటులో మాలలు ఎక్కువ శాతం ఉన్నారని ఖచ్చితంగా మాలలకు సీటు ఇవ్వాలనే డిమాండ్ కూడా వీరు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సామాన్యునికి ఇస్తే డబ్బులు దోచుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారని ప్రస్తుతం ఉన్న ఎంపీ అభ్యర్థి పై విమర్శలు గుప్పిస్తున్నారు.

Next Story

Most Viewed