- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల్లూరు డీఆర్సీ సమావేశంలో రచ్చ రచ్చ
నెల్లూరు డీఆర్సీ సమావేశం రచ్చ రచ్చగా మారింది....

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు డీఆర్సీ సమావేశం(Nellore DRC meeting) రచ్చ రచ్చగా మారింది. కరేడు భూముల(Karedu lands)పై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ తూమాటి(MLC Tumati) వర్సెస్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(MLA Somireddy Chandramohan Reddy) మధ్య మాటల యుద్ధం నడిచింది. కరేడు భూసేకరణపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీ తూమాటి డిమాండ్ చేశారు. అయితే ఇందుకు కలెక్టర్ వివరణ ఇచ్చారు. కానీ తూమాటి వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలుగజేసుకున్నారు. కరేడు భూములపై వైసీపీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని, తూమాటి పద్ధతి మార్చుకోవాలని సూచించారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల జోక్యంతో సమావేశాన్ని వైసీపీ ఎమ్మెల్సీ బహిష్కరించారు.
కాగా నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడుతో పాటు చుట్టు ఉన్న 15 గ్రామాల్లో ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, రామయపట్నం పోర్టు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా 20 వేల ఎకరాల భూములను సేకరించేందుకు కసరత్తులు చేసింది. కరేడు గ్రామంలో సుమారు 4,500 నుంచి 5 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ మేరకు భూసేరణ ప్రక్రయను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా నెల్లూరు ఆర్సీ సమావేశంలో ఈ భూసేకరణపై చర్చ పెట్టారు. దీంతో రసాభాసగా మారింది.






