- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP:‘కోట్లాది ప్రజల హృదయాలు ఉప్పొంగుతున్నాయి’.. మంత్రి కీలక వ్యాఖ్యలు
అమరావతి పునర్నిర్మాణ పనులకు ఇవాళ(శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అంకుర్పారణ చేయనున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: అమరావతి పునర్నిర్మాణ పనులకు ఇవాళ(శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అంకుర్పారణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆంధ్రుల చిరకాల స్వప్నం ప్రజా రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చేసాయని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి(Minister Kolusu Parthasarathy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి పున:శంకుస్థాపనకు వస్తున్న ప్రధానికి హార్దిక స్వాగతమని తెలిపారు. గత వైసీపీ(YSRCP) పాలనలో దుర్మార్గపు ఎత్తుగడలతో ఉనికే కోల్పోయే పరిస్థితి నుంచి అద్భుత రాజధాని సాకారం అవుతుండడం హర్షణీయం అన్నారు. ప్రధాని రాకతో కోట్లాది మంది ప్రజల హృదయాలు ఉప్పొంగుతున్నాయి.
ఈ తరుణంలో అమరావతి(Amarawati)లో రూ.49,040 కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్న ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. జీఏడీ టవర్, హెచ్‌ఓడీ టవర్లు, అసెంబ్లీ భవనం, హైకోర్టు ప్రధాన రోడ్లు, ట్రంక్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. వేల కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రాజెక్టులను, నాగాయలంకలో ఏర్పాటు చేయనున్న మిసైల్ టెస్ట్ రేంజ్ , విశాఖలో పీఎం ఏక్తామాల్ తదితర పనులు ప్రారంభించడం ఆంధ్ర రాష్ట్ర ప్రగతి పట్టాలు ఎక్కుతుందనడానికి నిదర్శనం అని తెలిపారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చడానికి విశేష కృషి చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.






