- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి బిగ్ అలర్ట్... ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది...

దిశ, వెబ్ డెస్క్: రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం(North Bay of Bengal)లో అల్పపీడనం(low pressure) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) తెలిపింది. ఈనెల 25 నాటికి తూర్పుమధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 26కు దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయువ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. . 27 నాటికి దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ వాయుగుండం ప్రభావంతో రానున్న గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు బుధవారం లోపు తిరిగి రావాలన్నారు. రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కిందకు వెళ్లొద్దని హెచ్చరించారు.






