- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
by Vemula.Srinu Prasad |
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. ..

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ(Meteorology Department) బిగ్ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు చాలా ప్రాంతాల్లోనూ వర్షం కురిపింది. మోస్తరు నుంచి మొదలైన వర్షం కొద్దిసేపటికే దంచికొట్టింది. సీమ జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరులోనూ శనివారం సైతం వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారి ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
Next Story






