Heavy Rains: కోస్తాంధ్రలో రెవెన్యూ శాఖ అప్రమత్తం

by Vemula.Srinu Prasad |

కోస్తాంధ్రకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేశారు..

Heavy Rains: కోస్తాంధ్రలో రెవెన్యూ శాఖ అప్రమత్తం
X

దిశ, వెబ్ డెస్క్: కోస్తాంధ్ర(Kostandra)కు వాతావరణ శాఖ(Weather Department) భారీ వర్ష సూచన చేశారు. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరకముందే స్థానికులను పునరావాసాలకు తరలించాలని సూచించింది. అలాగే మత్య్సకారులు(Fishermen) సముద్రం(Sea)లోకి వెళ్లొద్దని తెలిపింది. వాగులు, వంకలు పొర్లే ఛాన్స్ ఉందని ఆ వైపు ఎవరూ వెళ్లొద్దని ప్రకటించింది.

దీంతో మంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Anagani Satyaprasad) అలర్ట్ అయ్యారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. పూర్తి అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ(Revenue Department)ను ఆదేశించారు. దీంతో ఎక్కడికక్కడ సహాయ చర్యలు అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. లోతట్టు ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. స్థానిక ప్రజలను పునరావాసాలకు తరలించేందుకు రెడీ అవుతున్నారు.

Next Story