- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేటీకరణ చేయనివ్వం: చంద్రబాబుకు ఎమ్మెల్సీ బొత్స హెచ్చరిక
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాష్ట్రంలో మరోసారి సంచలనంగా మారింది. ..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ(Visakhapatnam Steel Plant Privatization) అంశం రాష్ట్రంలో మరోసారి సంచలనంగా మారింది. గతంలోనే స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం అడుగులు వేసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తంకావడంతో ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గింది. కానీ ప్లాంట్ నష్టాల్లో ఉందని, ఆర్థిక సాయం చేసింది. ఆ తర్వాత ప్లాంట్ ఉద్యమం అడుగున పడింది.
కానీ ఇటీవల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోతోందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో అధికార పార్టీ ఖండించింది. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గళం విప్పింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని ప్రకటించింది. విశాఖలో ఆందోళనలు నిర్వహించింది. స్టీల్ ప్లాంట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయనివ్వమని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు.
తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Mlc Bosta Satyanarayana) కూడా ఆదే మాట చెప్పారు. విశాఖ ఉక్కు పరిరక్షణే తమ ధ్యేయమని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయనివ్వమన్నారు. ప్రజా ఉద్యమంగా మారితేనే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయడం చంద్రబాబు నైజమని బొత్స సత్యనారాయణ విమర్శించారు.






