ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు.. ఎన్జీవోలు ఏమన్నారంటే..!

by Vemula.Srinu Prasad |

ఉద్యోగుల సమస్యలపై ఎన్జీవోలతో చేపట్టిన ప్రభుత్వం చర్చలు ముగిశాయి..

ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు.. ఎన్జీవోలు ఏమన్నారంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగులతో ప్రభుత్వం చేపట్టిన చర్యలు ముగిశాయి. ఈ సందర్భంగా 23 సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎన్జీవోలు తీసుకెళ్లారు. రాష్ట్ర ఎన్టీవో అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ చైర్మన్ ను నియమించాలని కోరినట్లు తెలిపారు. అలాగే ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఉద్యోగులకు రావాల్సిన 4 డీఏల్లో కనీసం ఒకటైన చెల్లించాలి. పీఆర్సీ, డీఏలపై తక్షణమే ప్రకటన చేయాలి. ఉద్యోగుల ఈహెచ్ఎస్ కార్డుల సీలింగ్ పెంచాలి. ఇన్సూరెన్స్ వర్తింపజేసి రీఎంబర్స్ మెంట్ ఇవ్వాలి. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. రిటైర్డ్ ఉద్యోగులకు తగ్గించిన పింఛన్ ను పునరుద్ధరించాలి. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతలు ఇవ్వాలి.’’ అని కోరినట్లు విద్యాసాగర్ తెలిపారు.

Next Story