- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం చంద్రబాబుకు లక్ష్మీనారాయణ మూడు కీలక సూచనలు
విశాఖ సీఐఐ సదస్సులో రాష్ట్రానికి ప్రభుత్వం భారీ పెట్టుబడులను ఆహ్వానించింది....

దిశ, వెబ్ డెస్క్: విశాఖ సీఐఐ సదస్సు(Visakhapatnam CII Conference)లో రాష్ట్రానికి ప్రభుత్వం భారీ పెట్టుబడులను ఆహ్వానించింది. అంతేకాదు ఆయా కంపెనీలతోనూ ఎంవోయూలు చేసుకుంది. అలాగే పలు ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబునాయుడు(CM Chandrababu Naidu) శంకుస్థాపనలు చేశారు. దీంతో సీఐఐ సదస్సు సక్సెస్ అయిందని ప్రభుత్వ వర్గాలతో పాటు అధికారులు సైతం హర్షం వ్యక్తం చేశారు. వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
అయితే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడమే కాదని, క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ సీబీఐ జేడీ వివి. లక్ష్మీనారాయణ తెలిపారు. అంతేకాదు ప్రభుత్వానికి మూడు అంశాలను సూచించారు. మొదటిది సమర్థవంతంగా పని చేయాలని, సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే భూవివాదాలను త్వరగా పరిష్కరించాలన్నారు. పర్యావరణ అనుమతులు సైతం త్వరితగతిన మంజూరు కావాలని, అప్పుడే కుదిరిన ఒప్పందాలు పరిశ్రమలుగా మారి రాష్ట్రం ఆర్థికంగా వృద్ధి చెందుతోందన్నారు. అటు యువతకు కూడా ఉద్యోగ కల్పన సాధ్యమవుందని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.






