- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది...

దిశ, వెబ్ డెస్క్: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్(TTD EO Anil Kumar Singhal)ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదే స్థానంలో ముద్దాడ రవిచంద్ర(Muddada Ravichandra)ను నియమించింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం(Tirumala laddu adulterated ghee affair)లో అనిల్ సంఘాలను బదిలీ చేయాలని సిట్ లేఖ రాసి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలోనూ ఆయన అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగానే పని చేశారు. అయితే ఆ సమయంలో లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగినట్లు ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిట్‌కు బాధ్యతలు అప్పగించింది.
వైసీపీ అభ్యంతరంతో..
అయితే సిట్ సభ్యులపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీకోర్టును ఆశ్రయించడంతో సీబీఐ నేతృత్వంలోని సిట్‌ను నియిమించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ ఆధ్వర్యంలో నియామకమైన సిట్ సభ్యులు పలు కోణాల్లో విచారణ జరిపారు. విచారణ పూర్తి కావడంతో కోర్టుకు నివేదిక అందించారు. తిరుమల లడ్డూలో జంతువుల అవశేషాలు కలవలేదని, కానీ కల్తి జరిగినట్లు నివేదికలోపేర్కొన్నారు. అలాగే అప్పటి టీటీడీ అధికారులపై చర్యలు చేపట్టాలని, ఈవోను బదిలీ చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా తాజాగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాలను ప్రభుత్వం బదిలీ చేసింది.






