ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఎస్ విజయానంద్ సర్వీసు పొడిగింపు

by Vemula.Srinu Prasad |

సీఎస్ విజయానంద్ సర్వీసును పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఎస్ విజయానంద్ సర్వీసు పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎస్ విజయానంద్(AP CS Vijayanand) సర్వీసుపై ప్రభుత్వం(Government) కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో విజయానంద్ సర్వీసు ముగిసిపోనుంది. దీంతో 2026 ఫిబ్రవరి వరకు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి తర్వాత రాష్ట్ర స్పెషల్ సీఎస్‌గా సాయి ప్రసాద్‌కు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. 2026 మే నెలతో ఆయన సర్వీసు సైతం ముగియనుంది. అయితే మే తర్వాత కూడా సాయి ప్రసాద్‌ను సీఎస్‌గా కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు వాళ్లిద్దరికి ప్రభుత్వం నుంచి సమాచారం చేరినట్లు ప్రచారం జరుగుతోంది.

Next Story